తర్లుపాడులో ఘనంగా చీరల పంపిణీ

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే.30సమాజంలో సోదరభావాన్ని, మతసామరస్యాన్ని చాటిచెప్పేలా తర్లుపాడు మండల కేంద్రంలో ఓ చక్కని కార్యక్రమం జరిగింది. బక్రీద్ పర్వదినాన్నిపురస్కరించుకుని, సినీ నటుడు అలీ అభిమానసంఘంఆధ్వర్యంలో నాయుడుపల్లి కాలనీ లో ఎస్ సి మహిళలకు ఘనంగా చీరలను పంపిణీ చేశారు. అభిమాన సంఘం అధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ వలి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది.ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి దూదేకుల పెద్ద మస్తాన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులుమాజీ సర్పంచ్ సూరెడ్డి సుబ్బారెడ్డి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా నాయుడుపల్లి కాలనీకి చెందిన 100 మంది ఎస్సీ మహిళలకుచీరలను అందజేశారు..ఈ కార్యక్రమంలో అలీ అభిమాన సంఘం కార్యదర్శి గుమ్మ లక్ష్మయ్య ట్రెజరర్ రమేష్‌తో పాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper