తెలంగాణ ఉద్యమకారుడు రమేష్ జి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
కర్ణాటక రాష్ట్రం కార్వార్ జిల్లా రామ్ నగర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- జూన్ 2- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు హీరేకర్ రమేష్ జి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం కార్వార్ జిల్లా రాంనగర్ లో జాతీయ జెండాను మరియు బిఆర్ఎస్ పార్టీ జెండాను చేతబూని తెలంగాణ రాష్ట్రంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు కలలు కన్న తెలంగాణ సాకారం చేయడానికి తమ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు ముందు ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన తమ అధినేత కెసిఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి వినయ్ కుమార్, హెచ్ అశోక్, కె శివకుమార్, శ్రీజ, దీపిక,బి అనిత, హెచ్ నిర్మల, హెచ్ సింధు భాయ్ తదితరులు పాల్గొన్నారు.