తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా మూడు మండలాల సర్పంచ్‌లు

July 13, 2026 | తెలంగాణ

రూ.1.25 లక్షలకుపైగా ఆర్థిక సహాయం అందజేత – పావని కుటుంబానికి భరోసా

జనం న్యూస్, జూలై 13: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబాన్ని ఆర్మూర్, మోర్తాడ్, బాల్కొండ మండలాల సర్పంచ్‌లు సోమవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కష్టకాలంలో తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆర్మూర్ మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.50,000, మోర్తాడ్ మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున ఒక నెల వేతనమైన రూ.45,500, బాల్కొండ మండల సర్పంచ్‌ల ఫోరం తరఫున రూ.30,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మొత్తం రూ.1,25,500 ఆర్థిక సహాయాన్ని అందించి తమ సంఘీభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్, మోర్తాడ్, బాల్కొండ మండలాల సర్పంచ్‌లు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొని మృతి చెందిన సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

🌐 Select Language:
📰 ePaper