ధైర్యం కోల్పోవద్దు.. మేమున్నాం’ – పావని కుటుంబానికి భరోసా ఇచ్చిన ముత్యాల సునీల్ కుమార్
జ నం న్యూస్, జూలై 13: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోనితాళ్ళ రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని ఇటీవల మృతి చెందిన కారణంగా వారి కుటుంబాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ , వారి సతీమణి సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.పావని భర్త భానుచందర్, కుమారులు భవిత్, భవిన్‌లను కలిసి ఓదార్చిన ముత్యాల సునీల్ కుమార్, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతి చెందిన పావని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులను చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పావని మరణం తాళ్లరాంపూర్ గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, తక్కువ కాలంలోనే గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందిన ప్రజాప్రతినిధిగా ఆమె సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్, కేఎంసీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
