నిడమనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా దోసకాయల లింగయ్య, అట్టెం రవి
జనం న్యూస్: జూలై 13 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ నిడమనూరు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా దోసకాయల లింగయ్య (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా అట్టెం రవి (ఆంధ్రప్రభ) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దోరెపల్లి ప్రసన్నకుమార్ (నమస్తే తెలంగాణ), ఉపాధ్యక్షులుగా పోతుగంటి శ్రీనివాస్ (నవతెలంగాణ), కోశాధికారిగా చిత్రం ప్రసాద్ (ప్రజాపక్షం), కార్యదర్శిగా దోరెపల్లి నాగరాజు (జర్నలిస్ట్ మిర్రర్), కార్యవర్గ సభ్యులుగా రామడుగు రాంమూర్తి (దిశ), నల్లబోతు శివ (సూర్య), బొంగరాల శ్రీను (జనం న్యూస్) లు ఎన్నికయ్యారు. ఈసందర్బంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. తమ నియామకానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.