గుంటూరు జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా యాళ్ల దొరబాబు బాధ్యతల స్వీకరణ

జనం న్యూస్ జూలై 13 (ముమ్మిడివరం ప్రతినిధి ) :భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన యాళ్ల దొరబాబు ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొని దొరబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమ్ చంద్రశేఖర రావు, ఈదురు శ్రీనివాస్ రెడ్డి, దర్శనం శ్రీనివాస్, గాజుల వెంకయ్య నాయుడు, ఎడ్లపాటి స్వరూప రాణి, కుక్కర్ శ్రీనివాస్ యాదవ్, నడ్డి నాగమల్లేశ్వరి, మకుటం శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు యాళ్ల దొరబాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.