టిట్కో కాలనీ సమస్యలపై కలెక్టర్‌కు బీజేపీ వినతి
జనతా వారధి’లో భాగంగా స్పందనలో వినతిపత్రం*
జనం న్యూస్ జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం :ఈరోజు అంబేద్కర్ పవన్ కళ్యాణ్ జిల్లా అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు బీజేపీ ‘జనతా వారధి’ కార్యక్రమంలో భాగంగా వినతిపత్రం అందజేశారు. అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కర్ రావు ఆధ్వర్యంలో డిడ్కో బిల్డింగుల సముదాయంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.అమలాపురం అసెంబ్లీ పరిధిలోని 30 వార్డుల్లో ఉన్న నిరుపేదలకు నివాస గృహాలుగా టిట్కో బిల్డింగ్ సముదాయంలో 1632 ప్లాట్లు, 510 సొంత ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇందులో దాదాపు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ టిట్కో సముదాయం అమలాపురం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నివాసితులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించాలని, రెండు పోలింగ్ బూతులు, ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని, అలాగే మెయిన్ రోడ్డు నుంచి కాలనీకి కనెక్టింగ్ రోడ్డు వేయాలని వినతిలో కోరారు.టిట్కో సముదాయానికి సంబంధించి స్మశాన వాటిక లేకపోవడంతో బోడసకుర్రు పంచాయతీ వారు చనిపోయిన వారిని ఇక్కడికి తీసుకురావడానికి అంగీకరించడం లేదని, అమలాపురం పట్టణ స్మశానానికి తీసుకెళ్లాలని చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాబట్టి టిట్కో బిల్డింగ్ సముదాయానికి ఒక స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయాలని అమలాపురం బీజేపీ పట్టణ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, జిల్లా నాయకులు చీకరమెల్లి శ్రీనివాస్, దాట్ల సుబ్బరాజు, అరిగెల నాని, షేక్ షహీర్, కుసుమ సునీత, కురసా ఆంజనేయులు తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.