అరకు నియోజకవర్గంలో 95% ఓటర్లు నమోదు – పరిశీలకులు బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూలై 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఏంటిన్సివ్ రీజియన్ కార్యక్రమం జూలై 14 ఆఖరి రోజు కావడంతో అరుకు తెలుగుదేశం పార్టీ పరిశీలికలుగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు అరకు నియోజకవర్గం ఇంచార్జ్ దన్నుదొర తో కలిసి సర్ ప్రక్రియను అనంతగిరి మండలంలో దన్నుదొర కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాగ జగదీష్ మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయని పెదబయలు హుక్కంపేట అరకు వ్యాలీ ముంచంగి పుట్టు అనంతగిరి దుంబ్రిగూడ మొత్తం ఓట్లు 2,48,665 ఉన్నాయని, పెదబయలు లో 42,149 ఓటర్లు ఉన్నారని, 100/- పూర్తిగా నమోద చేశారని, హుకుంపేట మండలం 42,238 మంది ఓటర్లు ఉన్నారని 41,939 మంది ఓటర్లుగా బిఎల్వోలు నమోదు చేశారని 96.69 శాతంగా, ముంచింగు పూట్టు మండలంలో 42,239 మంది ఓటర్లు ఉన్నారని, బిఎల్వోలు 39,483 మంది వివరాలు 93.48 శాతంగా నమోదు చేయడం జరిగిందని, డుంబ్రిగూడ మండలంలో 39,438 మంది ఓటర్లు ఉన్నారని, దీనిలో ఇప్పటివరకు 38,041 మందిని ఓటర్లుగా నమోద కాగా 96.48 శాతం జరిగిందని, అనంతగిరి మండలంలో ఓటర్లు 38,464 ఉన్నారని, దీనిలో పూర్తి వివరాలు సేకరించిన వివరాలు 37,708 పూర్తి చేసి 98.03 శాతం చేశారని, అరకు వ్యాలీ లో 43,002 మంది ఓటర్లు గా ఉన్నారని దీనిలో ఇప్పటివరకు 37,545 మంది ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందని 87.31 శాతం చేశారని మొత్తంగా అరకు నియోజకవర్గంలో 2,36,865 మందికి ఓటర్లుగా అర్హత వచ్చిందని 95.25 శాతం పూర్తి చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు బూత్ లెవెల్ ఏజెంట్లుగా పనిచేసి బిఎల్వోలకి సహకరించడo వల్ల ఇది సాధ్య మైందని 14వ తేదీ కి శత శాతం పూర్తి చేయడానికి అందరూ కృషి చేసినందుకు అభినందనలు నాగ జగదీష్ దన్నుదొర తెలియజేశారు. అరకు నియోజకవర్గ ఇన్చార్జిగా దన్ను దొర పూర్తి బాధ్యత తీసుకొని కూటమి నాయకులతో సమన్వయం చేసుకొని 95% పూర్తి చేయడం అభినందనీయమని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం అధ్యక్షులు సుబ్బారావు జనసేన మండలం అధ్యక్షులు మురళి అరకు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు జన్ని బాలరాజు అనంతగిరి మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు నిర్మల అనంతగిరి మండలం కస్టర్ ఇంచార్జ్ సందీప్ అనంతగిరి గ్రామపంచాయతీ అధ్యక్షులు మటన్ భీమన్న ఉపాధ్యక్షులు రంజిత్ ప్రధాన కార్యదర్శి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.//