జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం

July 13, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో బిజెపి పార్టీ కార్యక్రమాలు విజయవంతం: అమలాపురం :ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి కాలంకి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో మాధవ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.పార్టీ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు:జనతా వారధి: ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద హెల్ప్ డెస్క్ నిర్వహించి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. చేరువ: కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేందుకు జిల్లా కార్యాలయాల్లో సేవా కేంద్రాల ఏర్పాటుమన ఊరు మన జెండా: ప్రతి గ్రామంలో కేంద్ర నిధుల వినియోగంపై వివరణ ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటుస్పూర్తి: సంచార జాతుల గౌరవం, సర్టిఫికెట్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన, పార్టీ కార్యాలయాల్లో ఉచిత న్యాయ సలహా వ్యవస్థ ఏర్పాటు 2026-27 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి వచ్చేందుకు మాధవ్, మంత్రి సత్య కుమార్ కృషి చేశారని పేర్కొన్నారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు, డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ అని అన్నారు.కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.7,700 కోట్లు కేటాయించిందని, ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి అరిగెల నాని, జిల్లా కార్యదర్శి దంతులూరి రమా వర్మ, పట్టణ అధ్యక్షులు అయ్యల భాషా, జిల్లా కార్యాలయ కార్యదర్శి డీవీఎస్ రాజు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంషు సాదిక్, సంసాని రత్న కుమార్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుసుమ సునీత తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper