హరితహారంలో భాగంగా 18వ వార్డులో మొక్కల నాటడం
జనం న్యూస్ ; 13 జూలై సోమవారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేట: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 18వ వార్డులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు.అనంతరం శేఖర్ అంజి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నరసింహులను అభినందించారు. 18వ వార్డులో వీధి విద్యుత్ స్తంభాలు అవసరమని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కోరగా, ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నరసింహులు, కార్యదర్శి మాడ శ్రీధర్, బాసంగారి శ్రీనివాస్, జోనల్ చైర్మన్ జోజీ తదితరులు పాల్గొన్నారు.