హోమ్ మంత్రి అనితకు ఎన్టీఆర్ వ్యవసాయ కమిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వినతిపత్రం
జనం న్యూస్ జూలై 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత వచ్చిన సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సభ్యులు కలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు యూనియన్ అధ్యక్షులు పథకం శెట్టి శ్రీనివాసరావు వారి సభ్యులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ లో యార్డ్ అసిస్టెంట్స్, అటెండర్, వాచ్ మెన్, డీఈవో, సుబాబాల్ అసిస్టెంట్ గా 25 నుండి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని ఇప్పటివరకు మినిమం టైం స్కేల్ జీతాలు రావటం లేదని, సమాన పనికి సమాన జీతం చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, పదవి విరమణ బెనిఫిట్స్ గ్రాట్యూట్ చెల్లించాలని , వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అటెండర్ వాచ్మెన్ జే ఎం ఎస్ ఏ ఎం ఎస్ సూపర్వైజర్ తదితరు ఖాళీ పోస్టులు అర్హులైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, డిజిటల్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అభద్రత భావం లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాదవస్తు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లతో హోం మంత్రికి వినతి పత్రం అందించి ప్రభుత్వానికి మా డిమాండ్లు తెలియజేయాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పొలిమేర పవన్ కుమార్ జిల్లా అధ్యక్షులు కోలపర్తి జగదీష్ కుమార్ రాపా ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.