నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో డాక్టర్ శరత్.కమల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్.
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల జెండా మన వీధిలో సోమవారం నంద లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె సచివాలయం లోని జెండా మాను వీధి నందు డాక్టర్ శరత్ కమల్ సోమవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి లార్వా సర్వే అండ్ ఫీవర్ సర్వే నిర్వ హించారు. ప్రతి ఇంటికి కూడా సైఫెనోత్రిన్ పోకల్ స్ప్రే కూడా చేశారు. గ్రామ ప్రజలం దరికీ కూడా కీటక జనత వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. డెంగ్యూ కేసు వల్ల వచ్చే లక్షణాల గురించి వివరిం చారు.గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పరిసరాల పరి శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. ప్రతి శుక్రవారం రోజున ఫ్రైడే డ్రైడే పాటించాలని తెలియ జేశారు. ప్రతి సోమవారం వెక్టార్ కంట్రోల్ అవుతుంది. దోమలకు నిలువైన ప్రదేశాలను గుర్తించి ఏపీ ఏఎన్ఎం హెల్త్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని కూడా గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ కార్య క్రమంలో సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి జిల్లా సుబ్బరాయుడు, నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సూపర్వైజర్ పి సునీల్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఈగ. మధు సూదన్ రెడ్డి, ఏఎన్ఎం చంద్ర, ఆశాలు లీలమ్మ నాగమణి పాల్గొన్నారు.