నందలూరు లో మెడికల్ షాపులు బంద్ విజయవంతం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.నందలూరు మండలం లో అఖిల భారత కెమిస్టులు సమాఖ్య పిలుపు మేరకు బుధవారం నందలూరులో నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ , విజయవంతమైనది. నందలూరు మెడికల్ షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు అరిగే సుబ్రహ్మణ్యం నేతృత్వంలో నందలూరులో మెడికల్ షాపులను మూసివేశారు. అనంతరం మేజర్ పంచాయతీ కేంద్రమైన నాగిరెడ్డిపల్లి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అరిగె సుబ్రహ్మణ్యం ( మణి ) మాట్లాడుతూ ఆన్లైన్లో మందులు అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ లను నిలిపివేయాలన్నారు. నకిలీ మందులు అమ్మ కాలనీ అరి కట్టాలన్నారు. ఈ డిమాండ్ పైన చేస్తున్న బందుకు రోగులు సహకరించాలని వారి అ సౌకర్యని కి మేము చింతి స్తున్నామ న్నారు. అనంతరం నందలూరు తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రతినిధులు జిలాని బాషా,సుబ్బు, నాగేంద్ర, వేణు, సుబ్రహ్మణ్యం షఫీ,సురేష్, విశ్వం,జిలాని, ప్రసాద్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో మందులు అమ్మకాలకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. నకిలీ మందులపై తమ నిరసన గళం విప్పారు