నిర్లక్ష్యం నీడలో ప్రజాప్రయోజనం పార్కులు

June 27, 2026 | తెలంగాణ

సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే గాని ప్రత్యేకంగా పట్టించుకోని అధికారులు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా
పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

జనం న్యూస్ తేదీ 27-06-2026 జహీరాబాద్ పట్టణంలో అనేకచోట్ల కాలనీలలోని పార్కులలో ప్రజల అవసరం కోసం పార్కులను ఏర్పాటు చేసి ప్రజలు ఉదయం నడక చేయడానికి సౌకర్యవంతంగా ఉండేటట్లు పార్కులను కోట్ల రూపాయలు పెట్టి తీర్చిదిద్దినారు కానీ వాటి మీద ప్రత్యేక శ్రద్ధ లేనందుకు పిచ్చి మొక్కలు ముళ్ళకంపలతో నిండిపోయి ప్రజలు వినియోగించుకోవడానికి అసౌకర్యవంతంగా తయారై ముళ్ళ పొదలు పెంటకుప్పల్లాగా తయారైనాయి ప్రస్తుతం జహీరాబాద్ పట్టణంలోని ఐడిఎస్ఎండి కాలనీలో గల పార్కు ప్రత్యేక పర్యవేక్షణ లేక పిచ్చిముక్కలు మొలసి ఒక చిన్న అడవి లాగ తయారయింది గత నాలుగు సంవత్సరాల క్రితం లక్షల రూపాయలు పెట్టి ఈ పార్కు చుట్టూ కంచవేసి ఉదయం పూట ప్రజలు నడవడానికి సౌకర్యాలు కల్పించినారు ఆ తర్వాత ఆ పార్కును పూర్తిగా మర్చిపోయినారు కేవలం ఆరు నెలలు మాత్రమే ఆ పార్కు ప్రజలకు వినియోగించుకోవడానికి వచ్చినది ప్రత్యేక పర్యవేక్షణ లేక పార్కులో పందులు వీధి కుక్కలు వీధి పశువులు చేరి కంచెను మొత్తము నాశనం చేసినాయి ఇష్టం వచ్చిన పిచ్చి మొక్కలన్నీ పెరిగి ప్రజలకు వాడుకోడానికి రావడం లేదు కావున పురకపాలక సంఘం అధికారులు తమ పరిధిలోకి వచ్చే ప్రజా ప్రతినిధులు ఇలాంటి పార్కులపై స్పందించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలి ప్రజలకు నడవడానికి పనికి వచ్చే పార్కులు అసౌకర్యంగా తయారైనందుకు చాలామంది ప్రజలు రోడ్లపై ఉదయం పూట నడవడంతో అనేక సందర్భాలలో ప్రమాదాలకు గురవుతున్నారు అందులో ముఖ్యంగా వృద్ధులకు చిన్న పిల్లలకు మహిళలకు గర్భిణీ స్త్రీలకు ఇలాంటి పార్కులు చాలా ఉపయోగపడతాయి కానీ అసౌకర్యంగా ఉన్నందుకు రోడ్ల పైన వెళ్లి నడవల్సిన పరిస్థితి ఉంది కావున జహీరాబాద్ పట్టణ ప్రజల పక్షాన ఇలాంటి పార్కులను అధికారులు నాయకులు గుర్తించి సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించాలని కోరడమైనది

🌐 Select Language:
📰 ePaper