రైతు వేదికలలో విత్తన మేళాను పరిశీలించిన ఏ.డి.ఏ. ఆదిరెడ్డి*

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఎ డి ఎ) ఆదిరెడ్డి మండలంలోని పెద్దకోడేపాక, గట్లకానిపర్తి శాయంపేట క్లస్టర్లను సందర్శించి రైతు వేదికలలో నిర్వహిస్తున్న విత్తన మేళా యకార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, జూన్ నెల ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో జూలై నెలలో వరి సాగు చేయదలచిన రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాల వ్యవధిలో పండే కేన్ఎం-7715, కేన్ఎం-1638 వంటి వరి రకాలను సాగు చేయడం వల్ల సమయానికి కోత పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. అలాగే జూలైలో వరి నాట్లు వేయదలచిన రైతులు ఆర్ న్ ఆర్-15048 రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా 15-06-2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు అలాగే పాత పట్టాదారులలో రైతు భరోసా పథకానికి సంబంధించిన డీబీటీ (డీబీటి) విఫలమైన లావాదేవీలు, బ్యాంకు ఖాతా మార్పులు లేదా ఇతర బ్యాంకింగ్ సంబంధిత సమస్యలు ఉన్న రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా 30-06-2026 లోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (ఎ ఈ ఓలు) సంప్రదించాలని సూచించారు. రైతులు విచారణకు వచ్చే సమయంలో పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్/ఖాతా వివరాల జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కోరారు.రైతులకు పంటల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక సూచనల విషయంలో వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి (ఎం ఎ ఓ) మార్క ప్రియదర్శిని వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎ ఈ ఓ లు) అన్వేష్, జ్యోత్స్న రైతులు విత్తన డీలర్లు పాల్గొన్నారు..