పంట వ్యర్థాల దహనంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం. అవగాహన లోపంతో రైతులు నష్టాల బాట

May 31, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల పెద్దకోడపాక గ్రామంలో రైతులు పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిన పంట వ్యర్థాలకు నిప్పంటించి కాల్చివేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించినప్పటికీ, రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమిలోని సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు, పోషకాలు నాశనమవడంతో నేల సారం తగ్గి భవిష్యత్తులో పంట దిగుబడులు పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాల దహనం వల్ల మంటలు ఇతర పొలాలకు వ్యాపించి భారీ పంట నష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. ఇటీవల మండలంలోని కొప్పుల,పెద్దకోడెపాక లో అగ్ని ప్రమాదం గ్రామంలో పంట వ్యర్థాల మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి, పాఠశాల గది,వాహనాల దగ్ధం ఘటన జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా పంట వ్యర్థాల దహనం వల్ల వెలువడే పొగ వాతావరణ కాలుష్యాన్ని పెంచడంతో పాటు ప్రజల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది. పరిస్థితి మరింత విషమించకముందే వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పంట వ్యర్థాల నిర్వహణకు ప్రత్యామ్నాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయాలని పలువురు కోరుతున్నారు. అధికారు లు ఇప్పటికైనా స్పందించి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు….

🌐 Select Language:
📰 ePaper