యాదవ విద్యార్థుల పురస్కార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
జనం న్యూస్ ; 30 మే శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఆదివారం రోజు ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన యాదవ విద్యార్థులకు సత్కార కార్యక్రమం కలదని పోచ బోయిన శ్రీహరి అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, చలకాని వెంకట్ యాదవ్ తదితరులు హాజరవుతారని కావున సిద్దిపేట జిల్లాలోని యాదవులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మామిండ్ల ఐలయ్య యాదవ్, బైరి రాములు యాదవ్, ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, మల్లికార్జున్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, దాసరి శ్రీనివాస్ యాదవ్, బాగు యాదగిరి యాదవ్, బొల్లు రాము యాదవ్, రాజయ్య యాదవ్, బిక్షపతి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, వెంకటేశం యాదవ్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.