పర్యావరణ పరిరక్షణ మానవాళి బాధ్యత
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 05-06-26నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా. నందలూరు కన్యక చెరువు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమం నకు శ్రీకారం చుట్ట డం జరిగింది.ఈ సంద ర్భంగా డాక్టర్ జయ భాస్కరరావు మాట్లాడు తూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించి పచ్చదనం పెంపొందిస్తే.పర్యావరణ హితానికి పాల్పడిన వారమవు తామని తద్వారా కాలుష్యం నివారించి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని, క్లబ్ ద్వారా ఇప్పటివరకు నాటిన మొక్క లను సంరక్షించడం ఆనంద దాయకం అని తెలియ జేశారు.ఎస్ ఐ మన్నెం రామ మోహన్ మాట్లాడుతూ పర్యా వరణాన్ని రక్షించినప్పుడు అది మానవాళికి రక్షగా ఉపయోగ పడు తుందని దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసు కోవాలని ప్రతి సంవత్సరం నాటిన మొక్కలను సంరక్షించి వచ్చే ఏడాదికి మరిన్ని మొక్కలు విధిగా నాటింపజేసి , అడవు లను రక్షించాలని ఇప్పుడు కూడా ప్రకృతికి మేలు కలిగించే మర్రి, రావి చెట్లను తీసుకు వచ్చామని తెలుపుతూపర్యా వరణాన్ని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనం రక్షించుకోవడమే అన్న సూత్రాన్ని ముఖ్యంగా పాఠశాల యందు విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించాలని తద్వారా హరిత గ్రామాలు గా వృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో లయన్ కుర్రా. మణి యాదవ్, నీటి సంఘం అధ్యక్షులు బూసెట్టి,వెంకట సుబ్బయ్య ,క్లబ్ ప్రెసిడెంట్ ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, జంగం శెట్టి హరి, గంధం గంగాధర్, తీగల కుంట వెంకటేష్, పొన బోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.