పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ

September 3, 2026 | తెలంగాణ

*జుక్కల్, సెప్టెంబర్ 03, జనం న్యూస్*తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామ స్థానిక ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మహేష్ ఉపసర్పంచ్ సంగ్రామ్ పటేల్ చేతుల మీదుగా గురువారం యూనిఫారాలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విద్యార్థులకు కావలసిన అన్ని వసతులను కల్పిస్తోంది. సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి” అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం వున్నారు.

🌐 Select Language:
📰 ePaper