పూడిమడక మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

May 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్, మే 20,అచ్యుతాపురం :అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం కొండపాలెంలో మార్కెట్ యార్డ్ ను అధికారులతో కలిసి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు.మత్స్యకారులకు వీలుగా ఉండేటట్లు,ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ వచ్చి,ఇక్కడే కొనుగోలు చేసేటట్టు విశాలవంతంగా అన్ని వసతులు మార్కెట్ యార్డుని నిర్మించాలని అధికారులకు సూచించారు.అనంతరం మ్యాప్ ను కూడా పరిశీలించి, పార్కింగ్,డ్రైనేజీ విభాగం అంతా కూడా భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటట్లు చూస్తూ,నిర్మాణం అయ్యే వరకు అధికారులు దగ్గరుండి పరిశీలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper