పోచమ్మ తల్లి బోనాల వేడుకల్లో కాంచి మహేందర్ ఆధ్వర్యంలో ఘన సన్మానాలు

August 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా ఫతేనగర్‌లోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ మేడ్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, శంకర్ యాదవ్, వడ్డేపల్లి రాజేశ్వర్ తదితరులు పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్న నాయకులు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper