పోచాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం

July 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్;జూలై 9 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)ఐ పోలవరం మండలం ఐ పోలవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ పోచాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా నెల రోజులు ప్రతిరోజు రాత్రి అమ్మవారి సేవ చేస్తూ 8 7 26 బుధవారం రాత్రి అమ్మవారి జాగరణ లక్ష్మీవారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ కనకారావు మరియు పాత ఇంజరం టి కొత్తపల్లి మాతృమూర్తులు సేవలందించడం జరిగింది వీరిని ఆలయ కమిటీ వారు అభినందించడం జరిగింది. గ్రామస్తులు మాతృమూర్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మధ్యాహ్నం నుండి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలు అన్న ప్రసాదం ఏర్పాటు చేసి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper