శ్రావణమాస రెండవ మంగళవారం భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
జనం న్యూస్ ఆగస్టు 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ దేవస్థానం శ్రీ పరమేశ్వరి పార్టీ జంక్షన్ లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ మంగళవారం పర్వదిన సందర్భంగా స్వామి విగ్రహానికి పుష్పాలతో అలంకరించి, తమలపాకులు పూజ, సింధూరం పూజ అభిషేకాలతో అర్చక స్వాములు పూజలు నిర్వహించారని దేవస్థానం ట్రస్ట్ పొలిమేర నాయుడు బ్రదర్స్ తెలియజేశారు. ఈ రోజు తెల్లవారు 4 గంటల నుండి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారని, ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని అనుగ్రహం పొందారని, అనంతరం కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఈ పూజా కార్యక్రమాలన్నీ దేవస్థాన ఆస్థాన అర్చకులు చాడ శేష్ కుమార్ శర్మ సత్యనారాయణ శర్మ చిన్ని స్వామి నిర్వహించారని నాయుడు బ్రదర్స్ తెలియజేశారు.//