ప్రజలకు చేరువ లో నే నాగిరెడ్డిపల్లి -2 సచివాలయంఉండాలని కలెక్టర్ వినతి పత్రం :-రాచూరి మురళి

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు ఈ రోజున కడప జిల్లా కలెక్టర్ కార్యాల యము నందు రాచూరి మురళీధర్ వెళ్లి నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ రూఅర్బన్ పంచాయతీ నందలూరు మండలంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గ్రామ పంచాయ తీలలో ఒకటి అని తెలిపి ఇక్కడ రైల్వే స్టేషన్, కోర్టు, విద్యుత్ శాఖ కార్యాల యాలు, బ్యాంకులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు తదితర ప్రజా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అయితే, నాగిరెడ్డిపల్లి ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయం-2 ప్రస్తుతం నందలూరు గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతోందని దీనివల్ల ప్రజలు 3 నుండి 5 కిలోమీటర్ల వరకు ప్రయాణిం చాల్సి వస్తోంది. రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో పాటు ఒక్కసారి ఆటో ప్రయాణానికి రూ.100 నుండి రూ.200 వరకు ఖర్చ వుతోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాం గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలకు అన్ని విధాలుగా కేంద్ర స్థానంగా ఉన్న నాగిరెడ్డిపల్లి మేజర్ రూర్బన్ పంచాయతీ పరిధిలోనే గ్రామ సచివాల యం-2ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా ప్రయో జనాలకు అనుకూలంగా ఉంటాయని అందువల్ల ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని తగిన భవనంలో గానీ ఏర్పాటు చేసి ప్రజలకు అందు బాటులో ఉంచవలసిందిగా వినమ్రంగా ప్రార్థిస్తున్నామని తెలిపి ప్రజా సౌలభ్యం దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డిపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజల నుండి కోరడ మైనది దీనికి సంబంధించి నటు వంటి అధి కారులు సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం లో వేప గుంట డేవిడ్ కళ్యాణ్ రాజ్ ,మాజీ ఎంపిటిసి మాడపూరిశ్రీరాములు,శివ నరసింహులు , వీరబల్లి జయ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper