బందు విజయవంతం.* *విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.*

July 10, 2026 | తెలంగాణ

*విద్యా శాఖ మంత్రి నియమించాలి.*

*ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్ర చట్టాన్ని తీసుకురావాలి* . –

27వేల ప్రభుత్వ పాఠశాలలు 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు నిర్ణయాన్ని

* *ఉపసంహరించుకోవాలి.*

*పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ని విడుదల చేయాలి.*

బిచ్కుంద జూలై 10 జనం న్యూస్PDSU, ఆధ్వర్యంలో మద్నూర్ –బిచ్కుంద మండల కేంద్రంలో విద్యారంగా సమస్యలు పరిష్కారానికై ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బందు విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా *PDSU రాష్ట్ర కార్యదర్శి R గౌతమ్ కుమార్ మాట్లాడుతూ* 27వేల ప్రభుత్వ పాఠశాలలు 4వేల క్లస్టర్ ప్రభుత్వ పాఠశాలలుగా కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనీ, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలను వెంటనే మానుకోవాలనీ, ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలనీ, అన్ని ఖాళీ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలనీ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి కఠిన నియంత్రణలు అమలు చేయాలనీ,పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలనీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్యను అందించాలనీ, పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్ల విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలనీ, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మధ్యాహ్నం భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ వంటివి అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు.ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యను కాపాడుకోవడానికి, విద్యాహక్కును పరిరక్షించుకోవడానికి ఈరోజు బందులో ప్రతి విద్యార్థి పాల్గొని జయప్రదం చేశారని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విద్యను గాలి కుదిలేసి ప్రవేట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతయితే పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టిందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్, బేగరి కృష్ణ ,లాలు ,మహేష్, మాధవ్ సంజు ,లక్ష్మణ్, శ్రీను, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper