బర్దిపూర్ దేవస్థానంలో పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న షికారి గోపాల్ దంపతులు
జనం న్యూస్ 22 05 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం నియోజకవర్గంలోని బర్దిపూర్ దేవస్థానంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు షికారి గోపాల్ దంపతులు తమ పెళ్లిరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. వేడుకలో పాల్గొన్న వారు షికారి గోపాల్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.