బాసు హనుమంతు నాయుడు ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

June 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04 జూన్ జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ని టౌన్ ఎస్ఐ,పోలీసులు అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు ఈ మేరకు అర్ధరాత్రి 03 గంటలకు పోలీసులు వారి స్వగృహానికి చేరుకోవడంతో పోలీసుల తీరుపై బాసు హనుమంతు నాయుడు మండిపడ్డారు అదే విధంగా నియోజకవర్గం లో ఎక్కడికి ఎక్కడ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ని అరెస్టు చేయడం పై ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో పోలీస్‌ల పహారాలు నిర్బంధాలు ఎందుకు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ప్రజా ప్రభుత్వం అంటూ బీఆరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ అంక్షలు ఎందుకు అని నిలదీశారు మూడు సంవత్సరాల పాలనకే ఇంత అభద్రతాభావమా ఇంతటి అరాచకమా అని మండిపడ్డారు. తమకు కొట్లాడటం కొత్తకాదని తెలిపారు.కేవలం పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలను ప్రజల కోణంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహా కేబినెట్‌ ఎంపీలు ఎమ్మెల్యేలు విహార యాత్ర కోసం ఎగవేసుకుని వస్తున్నారని అయినప్పటికీ గద్వాల కు సీఎం వస్తున్నాడన్న వాతావరణమే ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు

🌐 Select Language:
📰 ePaper