బూత్ నంబర్ 540 పరిధిలోని తులసివనం అపార్ట్‌మెంట్స్‌లో ఎస్‌ఐఆర్ ఫారమ్స్ డ్రైవ్
జనం న్యూస్ జులై 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి డివిజన్ నంబర్ 124, బూత్ నంబర్ 540 పరిధిలోని తులసివనం అపార్ట్‌మెంట్స్‌లో ఓటర్ల వివరాల పరిశీలన, ధృవీకరణ మరియు నవీకరణకు సంబంధించి ఎస్‌ఐఆర్ ఫారమ్స్ డ్రైవ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూర్ పాల్గొని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యతను నివాసితులకు వివరించారు.ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన బాధ్యత కూడా అని అన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎస్‌ఐఆర్ ఫారమ్‌ను పూర్తి చేసి, ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.