మహిళలకు నాబార్డ్ శిక్షణ ఉపాధి అవకాశాలకు పెద్దపీట

June 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మహిళ అభ్యున్నత పాటు ఉపాధి కల్పిస్తూ మహిళలు అన్ని రంగంలో నీలదోక్కుకోవాలని ఉద్దేశంతో ఎం..సువిధ కాటన్ హైo డ్లుమ్ క్లస్టర్ ప్రోగ్రాం ప్రారంభించింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో 25 మంది మహిళలకు 45 రోజులు శిక్షణ ఇచ్చారు ఒక మహిళకు రోజుకు శిక్షణ కాలంలో 150 రూపాయలు అందిస్తున్నారు. మహిళలు ఉపాధి అవకాశం కల్పియాలనే టవల్స్, చీరలు, బెడ్ షీట్స్ నేయడం, చేతి వృత్తులను కాపాడడం కోసం ట్రయినింగ్ ఇచ్చారు. మహిళలు శిక్షణ కాలం పూర్తయిన తరువాత ప్రభుత్వం ఉపాధి కింద ఐదు లక్షల రూపాయలు లోన్ మంజూరు చేసి సబ్సిడీ ఇయ్యాలని వారు కోరారు. సహాయ సోషల్ సర్వీస్ సేవ సోసిటీ వరంగల్, అభిహర మార్కెటింగ్ ఏజెన్సీ హైదరాబాద్ ఆర్గనైజేషన్ చేశారు…..

🌐 Select Language:
📰 ePaper