మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్ శేషాద్రి
జనం న్యూస్ జూన్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఉదయం మార్నింగ్ వాక్ లో భాగంగా గ్రామ సర్పంచ్ గల్లి గల్లి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు ఉదయం బీసీ కాలనీకి వచ్చి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు మోరీల సమస్య అలాగే ఇండ్ల మధ్యన తుమ్మ పొదలు పనికిరానటువంటి చెట్లు తీసివేయాలని ప్రజలను కోరారు రోడ్డు మీద ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధించబడుతుందని తెలియజేశారు మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వచ్చేది వర్షాకాలం కాబట్టి నీళ్లు నిలకడగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే నీళ్లు నిలవకుండా ఉంటే దోమలు రావని తెలియజేశారు దోమల వల్ల అనారోగ్యం ఏర్పడుతుందని ప్రజలకు తగు సూచనలు తెలియజేశారు బీసీ కాలనీలో ముఖ్యంగా వీధిలైట్ల సమస్య ఉందని ప్రజలు గ్రామ సర్పంచికి వివరించారు పగలంతా విద్యుత్ లైట్లు వెలుగుతున్నాయి బీసీ కాలనీలో ఒక ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే రోడ్డు సాంక్షన్ అయిందని తెలియజేశారు కాలనీలో ఎక్కడెక్కడ స్తంభాలు అవసరము ఉంటాయి అని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు చెత్త రోడ్లమీద వేయరాదని అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తగు సూచనలు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు