మా గ్రామంలో పెద్దగుట్ట క్రషర్ను ఏర్పాటు జరగకుండా చూడాలి
జనం న్యూస్ ఆగస్టు 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక శివారులో పెద్దగుట్టకు నూతనంగా ఏర్పడే స్టోన్ క్రషర్ ఏర్పాటు జరగకుండా చూడాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పత్తిపాక పాలకవర్గం ప్రజలు మండల అధికారుల దృష్టికి మరొకమారు ఈ విషయాన్ని తెలియజేస్తూ గతంలో మండలంలోని ప్రతిపాక శివారులో శ్రీ వెంకటేశ్వర స్టూల్ ట్రెషర్ ఏర్పాటు చేయడం జరిగిందని దానివల్ల అనేక రకాల పర్యావరణ సమస్యలు ఆరోగ్య సమస్యలు చెడిపోవడం పంట పొలాలు చెడిపోవడం భూగర్భ జలాలు అడుగంటి పోవడం జీవరాశులు అంతరించిపోవడం జరిగిందని దీనివల్ల మానవ సమూహానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.ఇప్పుడు నూతనంగా అదే రీతిలో గ్రామానికి అతి సమీపంలో పెద్ద గుట్టకు నూతనంగా మరొక క్రషర్ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చర్య తీసుకోవాలని అధికారులను కోరారు.పత్తిపాక గ్రామం పచ్చని పంటలతో, చెట్లు చేమలతో, వాగు వంకలతో సస్యశ్యామలంగా ఉండేదని, ఈ స్టోన్ క్రషర్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని వల్లకాడుల తయారు చేస్తున్నారని అధికారులతో వాపోయారు.ఇట్టి విషయంపై గ్రామ పాలకవర్గం దీనికి సంబంధిత అధికారులు అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. గత రెండు రోజుల నుండి వివిధ దినపత్రికలలో పెద్దగుట్టకు నూతన క్రషర్రు కోసం భూమి సర్వే అనే శీర్షికతో వార్తలు వచ్చాయని, దీనిపట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.నూతన క్రషర్ ఏర్పాటు జరగకుండా చర్యలు తీసుకొని పత్తిపాక గ్రామాన్ని రక్షించాలని కోరారు.లేనియెడల పత్తిపాక గ్రామ ప్రజలను ఏకం చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం మా గ్రామంలో పందులను పెంచుకునే యజమానులపై వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ కు వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేశారు పత్తిపాక గ్రామంలో పందులు విచ్చలవిడిగా స్వైర. విహారం చేస్తున్నాయి వీటివల్ల అనేక రకాల రోగాలు వస్తున్నాయి అని తెలిపారు పందులను పోషించుకునే యజమానులు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు అని గతంలో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి నోటీస్ ఇచ్చి. గ్రామానికి దూరంగా పందులు నివసించడానికి గృహాలు ఏర్పాటు చేసుకోవాలి తెలియజేశారు వారు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని. లెక్కచేయకుండా ధిక్కరించారు అంటూ డాక్టర్ సాయి కృష్ణ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పత్తిపాక గ్రామం పంచాయతీ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డు మెంబర్లు నాలికె వీరప్రతాప్ గజ్జి రమేష్ గడ్డమీది హారతి కరుణాకర్ బహుజన సంక్షేమ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు బోల్లపల్లి ప్రసాద్ నామతా బాజీ అశోక్ తదితరులు పాల్గొన్నారు…