ముగిసిన అన్న అక్క శిక్షణ కార్యక్రమం….

June 20, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో కృత్రిమ మేధ, డిజిటల్ లెర్నింగ్ పై నిర్వహిస్తున్న రెండు రోజుల అన్నా- అక్క శిక్షణ కార్యక్రమం శనివారం తో ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ తెలిపారు. ఈ రెండు రోజుల శిక్షణలో భాగంగా అధ్యాపకులు, విద్యార్థులకు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్ మాస్టర్ ట్రైనర్ గా హాజరై ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు వాస్తవ సమయంలో సమస్య పరిష్కారంలో ఏఐ మరియు డిజిటల్ అభ్యాసం యొక్క ఉపయోగాలు, మెషిన్ లెర్నింగ్ మోడల్ పనితీరు విధానం, ఏఐ, డిఎల్, ఎమ్ఎల్ మరియు డిఎస్ ల మధ్య భేదాలు, సి, సి++ మరియు జావా యొక్క ప్రాథమిక భావనలు,ప్రోగ్రామ్లో కోడ్ అంటే ఏమిటి, సురక్షిత ఇంటర్నెట్ కనెక్షన్ మరియు పబ్లిక్ వై-ఫై ప్రమాదాలు, నకిలీ వెబ్సైట్, స్కామ్ లింకులపై అవగాహన, సైబర్ భద్రత, అదేవిధంగా విద్యార్థుల నైతికత, హక్కులు మరియు బాధ్యతలు మొదలగు అంశాలను వివరించారు. ఈ రెండు రోజుల శిక్షణ పొందిన డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బిచ్కుంద పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఏఐ. డిజిటల్ నైపుణ్యాలపై జూలై మాసంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏఐ ఇంటర్నషిప్ ప్రోగ్రాం నోడల్ అధికారులు డాక్టర్ వై. సంజీవరెడ్డి, వై. రేవతి, కె. అశ్విని,వైస్ ప్రిన్సిపాల్ డా . జి.వెంకటేశం , అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.హన్మండ్లు ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper