స్వచ్ఛ్ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీ ఓ బి రాజేశ్వరరావు

June 20, 2026 | ఆంధ్రప్రదేశ్


జనం జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర( SASA)కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు SASA కార్యక్రమంలో భాగంగా ఈ పర్యాయం అంగన్వాడీ కేంద్రాల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ శుభ్రత మన సంస్కృతిలో భాగమని, ప్రతీ ఒక్కరు పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. చిన్నారులు & ప్రజా ప్రతినిధులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంపీడీఓ కొమ్మాయి చెరువు & నేతాజీనగర్ అంగన్వాడీ కేంద్రాల్లో స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు.కేంద్రాలకు వచ్చే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి సమగ్రాభివృద్ధికి పెద్ద పీఠ వెయ్యాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.సందర్శనలో చెయ్యేరు మాజీ సర్పంచ్ చెల్లి సురేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు, మాజీ ఉప సర్పంచ్ బి వి నారాయణ స్వామి, పంచాయతీ కార్యదర్శి భాగయ్య, స్వర్ణ గ్రామ సిబ్బంది & పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.*

🌐 Select Language:
📰 ePaper