సాయిబాబా సన్నిధిలో మేడేపల్లి మౌనిష్ చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

June 20, 2026 | తెలంగాణ

జనం జూన్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శ్రీ షిరిడి సాయిబాబా ప్రముఖ భక్తుడు మేడేపల్లి మల్లికార్జున్ రావు కుమారుడు మేడేపల్లి మౌనిష్ చౌదరి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లిలోని శ్రీ షిరిడి సాయినాథుని దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.మేడేపల్లి మల్లికార్జున్ ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మౌనిష్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మౌనిష్ చౌదరి తన జన్మదినాన్ని సాయిబాబా సన్నిధిలో నిర్వహించడం అరుదైన ఆధ్యాత్మిక సంప్రదాయమని కొనియాడారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పబ్బులు, కేక్ కటింగ్ వంటి వేడుకలను ఫ్యాషన్‌గా నిర్వహిస్తున్న తరుణంలో, వాటికి భిన్నంగా దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.యువతలో మానవీయత, సేవాభావం పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా యువత మంచి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మేడేపల్లి కుటుంబ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, భక్తులు పాల్గొని మౌనిష్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper