విత్తనాల ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్

June 20, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని విత్తన మరియు ఎరువుల దుకాణాలు మరియు గోదాముల్లో వ్యవసాయ అధికారి అమర ప్రసాద్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీ సందర్భంగా గోదాముల్లోని విత్తనాలు మరియు ఎరువుల నిల్వలు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా విత్తన మరియు ఎరువుల స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ పట్టికలు పరిశీలించడం జరిగింది. విత్తనాలు మరియు ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని డీలర్లను హెచ్చరించడం జరిగింది. గోదాముల్లో తనిఖీల సందర్భంగా పలు దుకాణాల్లో పాత ధరతో కూడిన కాంప్లెక్స్ ఎరువులు గమనించడం జరిగింది, ఈ ఎరువులు అధిక ధరలకు అమ్మినచో లైసెన్స్ లు రద్దు చేస్తామని డీలర్లను హెచ్చరించడం జరిగింది. పాత ధరలతో కూడిన కాంప్లెక్స్ ఎరువులు వివరాలు దుకాణాల వారీగా మహాలక్ష్మి ట్రేడర్స్ 20-20-0-13 ఎం ఆర్ పి 1800 స్టాక్ 401 బ్యాగ్స్ సిద్ది రామేశ్వర జనరల్ స్టోర్స్ 20-20-0-13 ఎం ఆర్ పి 1475 స్టాకు 35 బ్యాగ్స్20-20-0-13 ఎం ఆర్ పి 1800 స్టాకు 240 బ్యాగ్స్ మన గ్రోమోర్ సెంటర్ 20-20-0-13 ఎం ఆర్ పి 1500 స్టాక్ 1480 బ్యాగ్స 20-20-0-13 ఎం ఆర్ పి 1800 స్టాక్ 447 బ్యాగ్స్ అగ్రోస్ రైతు సేవ కేంద్రం 20-20-0-13 ఎం ఆర్ పి 1500 స్టాక్ 350 బ్యాగ్స్20-20-0-13 ఎం ఆర్ పి 1800 స్టాక్ 400 బ్యాగ్స్అన్నదాత ట్రేడర్స్20-20-0-13 ఎం ఆర్ పి 1800 స్టాకు 244అదేవిధంగా రైతులందరికీ తెలియజేయునది ఏమనగా పైన తెలిపిన దుకాణదారులు పాత ధరలతో కూడిన కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నాను.

    🌐 Select Language:
    📰 ePaper