రోడ్డు ప్రమాదాల అవగాహణ పోస్టర్స్ విడుదల చేస్తున్న ఆర్ సి ఓ
జనం న్యూస్ జూన్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి అవగాహన కార్యక్రమాలలో భాగంగా మహత్మా జ్యోతిరావు పూలే గురుకులాల వరంగల్ RCO రాజ్ కుమార్ గారు పోస్టర్స్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణం చేసే సమయం మద్యపానం సేవించకూడదని అలాగే మొబైల్ ఫోన్ మాట్లాడుడని ప్రజలకు సూచించారు కచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ మరియు ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి మరియు ప్రజా సంక్షేమ వేదిక నాయకులు శనిగరపు శ్రీనివాస్ పుచ్చ సమ్మయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…