ఆర్ ఆర్ బి మరియు టి ఇ టి పరీక్షలు ఒకే రోజు అభ్యర్థుల్లో ఆందోళన

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 15 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :జూన్ 17 న నిర్వహించే టి ఇ టి వాయిదా వేయండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.రామచంద్రారెడ్డి తెలంగాణ టెట్ పరీక్ష మరియు ఆర్ ఆర్ బి పరీక్షలు ఈ నెల జూన్ 17వ తేదీన ఒకే రోజు నిర్వహించబడనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ యువత ఒకే రోజు రెండు కీలక పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలలుగా కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్ష తేదీని పునఃపరిశీలించాలని కోరుతున్నారు.అభ్యర్థుల కష్టాన్ని గుర్తించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఆర్ ఆర్ బి మరియు టేటు పరీక్షలు ఒకే రోజు ఉండటం వల్ల వేలాది మంది అభ్యర్థులు నష్టపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టి ఇ టి పరీక్షను వాయిదా వేయాలి అని రామచంద్రారెడ్డి కోరారు ఈకార్యక్రమంలో అయిజ పట్టణ బిజెపి అధ్యక్షుడు తెలుగు నరసింహ నాయకులు కంపాటి భగత్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ భీమన్న తదితరులు పాలుగొన్నారు

🌐 Select Language:
📰 ePaper