లింకు రోడ్ల మరమ్మత్తుకై అంచనా
జనం న్యూస్ 05జూన్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలను కలుపుతూ లింకు రోడ్లను పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏడుమోటలపల్లి నుండి నంచర్ల మీదుగా రంగాదాములపల్లి వరకు మద్దులపల్లి తండా నుండి పెగడపల్లి వరకు మద్దులపల్లి తండా నుండి వెంగళాయిపేట్మీదుగా లింగాపూర్ వరకు తండాల నుండి వివిధ గ్రామాలకు పూర్వంలో ఉన్న లింకు రోడ్లను పూర్తి చేయడానికి ట్రైబల్ ఏఈ ద్వారా అంచనాలు పంపించడానికి ఈరోజు ట్రైబల్ఏ ఈ ఈ మాధురి, పంచాయతీ రాజ్ డి ఈ ఈ అశ్విన్,తో కలిసి మొత్తం రోడ్లు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి, నంచర్ల ఉపసర్పంచ్ ఎడ్ల శ్యాం సుందర్ రెడ్డి, మండల నాయకులు పూసల తిరుపతి,లింగంపల్లి మహేష్,అల్లూరి సత్యనారాయణ రెడ్డి, రవి నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.