వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో బోరింగుల మరమ్మతులు – సర్పంచ్ బెజ్జం సాయి చర్యలు

June 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బీఎల్‌ఆర్ ఆదేశాల మేరకు, రానున్న వర్షాకాలంలో బలమైన గాలులు, విద్యుత్ అంతరాయాల కారణంగా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి తెలిపారు.గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగించాలనే ఉద్దేశంతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బోరింగులకు మరమ్మతులు చేపట్టించారు. ఏపూరి యాదగిరి ఇంటి వద్ద, కారింగుల సైదులు ఇంటి వద్ద, మోర్తాల శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు, బీసీ, ఓసీ స్మశాన వాటిక సమీపంలో, నర్సరీ వద్ద, అలాగే మిట్టగూడెంలోని మొదటి వార్డులో ఉన్న బోరింగులను వేరుపంగ పున్నమ్మ, భిక్షం సహకారంతో సర్పంచ్ బెజ్జం సాయి పునరుద్ధరింపజేశారు.వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు ఏర్పడినా గ్రామ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న సర్పంచ్ బెజ్జం సాయి సేవలను గ్రామస్థులు ప్రశంసించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper