సేవే లక్ష్యం – ప్రజల ఆరోగ్యమే ధ్యేయం. సాయిబాబా చౌదరి
జనం న్యూస్ మే 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ కాలనీలోని డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం పార్క్ వద్ద, గతంలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన బీపీ మిషన్ పరికరం చెడిపోవడంతో గత ఒక సంవత్సరంగా ప్రజలకు ఉపయోగపడకుండా ఉంది.ప్రజల అవసరాన్ని గుర్తించిన మందలపు సాయిబాబు చౌదరి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ యాజమాన్యంతో మాట్లాడి, కొత్త బీపీ మిషన్ పరికరాన్ని తెప్పించి తిరిగి ఏర్పాటు చేయించడం ఎంతో అభినందనీయమైన విషయం.“ప్రజా సేవ అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించేది. ప్రజల ఆరోగ్యాన్ని తన బాధ్యతగా భావించి, పనిచేయకుండా ఉన్న బీపీ మిషన్‌ను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మందలపు సాయిబాబు చౌదరి సేవా దృక్పథానికి నిదర్శనం. ”“సమాజానికి ఉపయోగపడే ప్రతి చిన్న పని కూడా గొప్ప సేవే. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, అవసరమైన చోట వెంటనే స్పందించి సేవలను అందించడం మందలపు సాయిబాబు చౌదరి ప్రత్యేకత.”ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న మందలపు సాయిబాబు చౌదరి కి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలిపారు