సాగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

June 13, 2026 | వైరల్ వార్తలు

మహిళ మృతి-భర్తకు తీవ్ర గాయాలు

జనం న్యూస్- జూన్ 13- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని శ్మశానవాటిక సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారు, మహీంద్రా తార్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన పాలపర్తి కాత్యాయని (55) అక్కడికక్కడే మృతి చెందారు.అదే కారులో ఉన్న ఆమె భర్త పాలపర్తి శ్రీనివాసరావు (66) తీవ్రంగా గాయపడగా వెంటనే స్థానికులు మరియు పోలీసులు ఆయనను 108 వాహనంలో నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని ప్రభుత్వ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందు తున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా ఆయన తీవ్ర షాక్‌కు గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. మృతురాలి కుమారుడు శ్రీకాంత్ తెలిపిన సమాచారం ప్రకారం సనత్ నగర్ కు చెందిన దంపతులు హైదరాబాద్ నుంచి త్రిపురాంతకం దైవదర్శనానికి వెళుతూ ఉండగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల ద్వారా తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై మృతురాలి కుమారుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో విజయపురి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

🌐 Select Language:
📰 ePaper