శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శాంతికమిటీ సమావేశం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.రాజంపేట అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రాంనాథ్ హెగ్డే గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం లో శాంతికమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగను సంతో షాలతో జరుపుకోవాలని సూచిం చారు,ఈ సంద ర్బంగా రాజంపేట అసి స్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రాంనాథ్ హెగ్డే మాట్లాడు తూ ఏలాంటిఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరుగు తుందని అలాగే సోషల్ మీడియా తదితర మాద్య మాల ద్వారా అసత్య సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు,ఈనేపథ్యంలో హిందూ సోదరుల విశ్వా సాలు మరియుమనోభావా లతో ముడిపడి ఉన్న గోవును పవిత్రంగా భావించి పూజించడం హిందూసోదరుల సంస్కృతిలో భాగంఆలాంటి గోవును హింసించినావధించేందుకు గోవులను కబేళాలకు అక్రమంగా రవాణా చేసినావధించేందుకు అమ్మినా మరియు కొన్నాగోవును వధించినాకఠినంగా శిక్షించాలి,అలాగే ఏ విధంగానైతే నెమలిని జాతీయపక్షిగా ప్రకటించారో అదే విధంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మరియు దేశంలోని స్లాటర్ హౌస్ మూసివేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసు కుంటూ సబ్ కలెక్టర్ గారికి జమీయతుల్ఉలమా-ఎ-హింద్, రాజంపేట శాఖ మరియు పట్టణ మసీదుల కార్యవర్గాల తరపున వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్య క్రమంలో పట్టణ మసీదుల కార్యవర్గ సభ్యులు జాహిద్ అలీ, అష్రఫ్ఖాన్, Skకరీం, పీరూసాహెబ్, ఏజాజ్,జుల్ఫికర్,ఆరిఫ్ జువెలర్స్, యాసీన్తదితరులు పాల్గొన్నారు. అబూబకర్, మండెం,అధ్యక్షుడు ,మస్జిద్ అబూ హురైరహ్ కమిటీ,ఉస్మాన్ నగర్ రాజంపేట మరియు ప్రధాన కార్యదర్శి జమీయతుల్ ఉలమా-ఎ-హింద్, రాజంపేట శాఖ, కడపజిల్లా.