శోభాయమానంగా 208 వ నగర సంకీర్తన

May 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ; జహీరాబాద్, మే 24: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన 208 వ నగర సంకీర్తన శోభాయమానంగా జరిగింది. నగర సంకీర్తన బృందం విద్యుత్ కాలనీలో రసరమ్య కీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. తొలుత 108 సార్లు హరేకృష్ణ మహామంత్రాన్ని జపించి, ప్రభు పాదుల వారి ప్రార్థన గీతంతో శోభయాత్రను ప్రారంభించారు. సంకీర్తన బృందం లోని కళాకారులు ఆలపించిన కీర్తనలకు లయబద్దంగా నృత్యం చేస్తూ శ్రీ కృష్ణ భావంలో తన్మయత్వం చెందారు. మహిళలు, పురుషులు, చిన్నారులు ఉత్సాహ భరితంగా కీర్తనలో పాల్గొన్నారు. అనంతరం కాలనీ లోని గణేష్ మంటపంలో ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు, హరేకృష్ణ మందిరం బాధ్యులు విభిషణ్ దాస ప్రభుజీ భక్తులను ఉద్దేశించి శ్రీమద్భగవద్గీత కర్మయోగం లోని 9, 10 శ్లోకాలను తాత్పర్య సహితంగా పారాయణం చేసి సోదాహరణంగా వివరించారు. గృహస్తశ్రమం, సన్యాస జీవితం అంతరాలను చెబుతూ వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా శ్రీకృష్ణ భక్తి భావనలోనే గడపాలని హితవు పలికారు. తన సర్వస్వాన్ని కృష్ణ భక్తిలో అర్పించిన వారికి ఏ లోటు ఉండబోదని సెలవిచ్చారు. ఏ సందర్భంగా సంకీర్తన బృందం సభ్యులు మహీందర్ గోడకే- సవితా గోడకే, గిరి -లత, బోల్గరి ప్రవీణ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వేద ఆశీర్వచనాలు అందజేశారు. హుగ్గెల్లి లో 177వ పల్లె సంకీర్తన ఇదిలా ఉండగా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలోను ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 177వ పల్లె సంకీర్తన సైతం నూతన ఉత్సాహంతో సాగింది. గ్రామ ఆంజనేయ స్వామి మందిరం నుండి బయలుదేరిన సంకీర్తన శోభాయాత్ర కీర్తనలు చేస్తూ గ్రామమంతా కలియ తిరిగారు. హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ రామ రామ హరే హరే అనే మంత్రాన్ని కీర్తిస్తూ భక్తులు పల్లె సంకీర్తన నిర్వహించారు. కాగా స్వస్తిక్ రెస్టారెంట్ యజమాని మహేందర్ ప్రసాద వితరణ చేశారు.

🌐 Select Language:
📰 ePaper