శ్రీ బోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో గ్రానైట్ పలకలతో ఫ్లోరింగ్ కు శంకుస్థాపన – చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ
జనం న్యూస్ ఆగస్టు 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కూటమి నాయకులు శాసనసభ్యులు దేవస్థానంలో అభివృద్ధి పనులు విషయంలో దాతలు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసిన పిదప ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చూసిన ప్రకారం మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా స్వయంభూ గా వెలసిన శ్రీ భోగలింగేశ్వర స్వామి అనుగ్రహంతో దాతలు కీర్తిశేషులు స్వామి సేవకులు బుద్ధ అప్పలనాయుడు జ్ఞాపకార్థం అతని భార్య పరమేశ్వరి వారి కుటుంబ సభ్యులు సహాయంతో 13 లక్షల రూపాయలతో గ్రానైట్ పలకలతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయుటకు ఈరోజు దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమంలో చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ధర్మకర్తలు మద్దాల నారాయణరావు మల్ల సూరిబాబు యలమంచిలి బంగారు రాజు రాపేటి నాగ సంతోష్ పెంటకోట అనూష గణేష్ సంతోషి మాత దేవస్థానం చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు పెంటకోట సుబ్రమణ్యం బొడ్డేడ రాము బుద్ధ రమణజీ కొణతాల జగన్నాథం నాయుడు పీలా కుమార్ రాజా కొణతాల నాగమణి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. మురళీకృష్ణ అర్చకులు పేరూరి వేణు సాత్విక్ సాయిరాం పరమేశ్వరరావు పూజా కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభం చేశామని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమం ముందుండి నడిపించిన జనసేన ఇన్చార్జ్ భీమరశెట్టి రామ్కీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని బుద్ధ అప్పలనాయుడు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మా పాలకవర్గం బాధ్యతలు తీసుకున్న తర్వాత పెద్ద కార్యక్రమంగా భావిస్తున్నామని, గతంలో దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమంలో అనేకమంది దాతలు ముందుకు వచ్చారని, ఇప్పుడు ఆస్థాన మండపం దేవాలయం ఒక ద్వారం వద్ద షెడ్డు నిర్మాణం త్వరలో దాతలు సహకారంతో ముందుకు వెళ్తామని సత్యనారాయణ దాతలకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.//