సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్, 2026, మే 30, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం లో, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన, కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో, శుక్రవారం రోజున, ఆలయ అధికారులు, హుండీలు విప్పి లెక్కింపు నిర్వహించారు. గత 67 రోజులకు, స్వామి వారికి భక్తులు, హుండీలో సమర్పించిన కానుకలు, రూపాయలు 31 లక్షల, 46 వెయ్యిల 891 రూపాయలు వచ్చినట్లు, అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో, దేవాదాయ, ధర్మదాయ శాఖ, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper