సిద్దిపేటలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం

June 1, 2026 | తెలంగాణ

*జనం న్యూస్ ; 1 జూన్ సోమవారం; సిద్దిపేట నియోజక వర్గ ఇంచార్జి వై.రమేష్ :సిద్దిపేటలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్ సమీపంలో బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో చిన్నారులు వీధి నాటిక ప్రదర్శించి పొగాకు, గుట్కా, సిగరెట్ తదితర వ్యసనాల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. “గుట్కా తినకు గుటుక్కుమనకు, సరదా సరదా సిగరెట్టు నరకానికి ఇది తొలిమెట్టు” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బ్రహ్మా కుమారీస్ నిర్వాహకురాలు బీకే భవాని మాట్లాడుతూ రాజయోగ మెడిటేషన్ ద్వారా వేల మందిని వ్యసనాల నుంచి విముక్తులను చేశామని తెలిపారు. వ్యసన రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీకే స్వప్న, వై. ఓంకారం, వెంకటేశం, అమరేందర్ రెడ్డి, ఆంజనేయ చారి, జగదీష్, కేశవరెడ్డి, బిందు, పద్మ, కరుణ, మన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper