సిద్దేశ్వరాలయంలో వైభవంగా రుద్రాభిషేకం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశంజహీరాబాద్, జూన్ 1:జహీరాబాద్ పట్టణం, అల్గోల్ రోడ్డు లోని శ్రీ సిద్దేశ్వరాలయం లో పురుషోత్తమ మాసం సందర్భంగా సోమవారం నాడు స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సంగమేశ్వర స్వామి రుద్రాభిషేకం నిర్వహించారు. స్థానిక కృష్ణ మోహన్ గౌడ్, రేణుకా గౌడ్, రాహుల్ గౌడ్, వంశీ గౌడ్,అభిరామ్ గౌడ్ కుటుంబం అన్నదానం కార్యక్రమం జరిపారు. ఆలయంలో ప్రతి అమావాస్య తో పాటు ప్రతి సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సంగయ్య స్వామి పేర్కొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించదలచిన వారు ఆలయ అర్చకులను సంప్రదించాలని కోరారు. అంతే కాకుండా శ్రీ సిద్దేశ్వర స్వామి వారి గర్భాలయంలో అభిషేకం చేయడానికి 200 రూపాయలు, శ్రీ సుబ్రమణ్య స్వామి , కాలభైరవ స్వామి, నవగ్రహ పూజ కార్యక్రమాలకు 250 రూపాయలు , శని తైలాభిషేకానికి 100 రూపాయలు, హోమం చేయదలచు కున్న వారు 500 రూపాయలు, అర్చన లో పాల్గొనే భక్తులు 50 రూపాయలు గా ఆలయ కమిటీ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం తో పాటు కుంకు మార్చన కార్యక్రమం సైతం నిర్వహించడం జరుగు తుందన్నారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప,శివశక్తి సంఘ బాధ్యులు సూదాం వెంకట్, గోరఖ్ నాథ్ పాటిల్, వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు , స్థానికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.