500పైన మార్కులు సాధించిన విద్యార్థులకు చిరు సన్మానం
జనం న్యూస్ జూన్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం బండపోతుగల్ గ్రామంలోతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండపోతుగల్ గ్రామంలోని పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.జెండా ఆవిష్కరణ అనంతరం బండపోతుగల్ గ్రామ 7వ వార్డ్ మెంబర్ అరుణ పోచయ్య పాల్గొని, ప్రస్తుతం 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 500కు పైన మార్కులు సాధించిన బండపోతుగల్ గ్రామ విద్యార్థుల ను 9 మందిని శాలువాతో సత్కరించిన అరుణ పోచయ్య అభినందించారు.విద్యార్థుల కృషిని ఆమె ప్రశంసిస్తూ, ఇలాంటి విజయాలు గ్రామానికి గర్వకారణమని అన్నారు.కార్యక్రమంలో,ఉపాధ్యాయులు,సర్పంచ్ లక్మీ ప్రవీణ్ రెడ్డి,ఉప సర్పంచ్ గోపాల్ కార్యదర్శి సురేంద్రరెడ్డి, వార్డు సభ్యులు, చిట్టెమ్మ, శంకర్, నర్సమ్మ, ముస్తాక్ఉసేన్, యదయ్య,అరుణ, ఏసమ్మ,గ్రామస్తులు పాల్గొన్నారు.