కె జి బి వి లో సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు హాజరైన ఛైర్మెన్

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ మే 25 పెబ్బేరు పెబ్బేరు పట్టణంలోని పీఎం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ లో విద్యార్థినుల నైపుణ్యాల పెంపునకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ (వేసవి శిక్షణా తరగతులు) ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు ఇలాంటి వేసవి శిబిరాల్లో నేర్చుకునే వివిధ రకాల నైపుణ్యాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు మారుతున్న కాలానికి అనుగుణంగా బాలికలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేజీబీవీల్లో ఇలాంటి ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోందని కొనియాడారు ఈ క్యాంపును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థినులను వారికి శిక్షణ ఇచ్చిన అధ్యాపకుల ను కేజీబీవీ ప్రత్యేక అధికారిని సిబ్బందిని చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు దాసరి జములమ్మ శివ సాయి భాగ్యలక్ష్మి శివ ఎంఈఓ జయరాములు ఎఫ్ఏఓ ఉమాదేవి జిఈసిఓ ఇంద్రవేణి స్పెషల్ ఆఫీసర్ పద్మ ప్రభుత్వ బాలుర ప్రధానోపాధ్యాయుడు నరసింహ గౌడ్ పాఠశాల సిబ్బంది విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.