ప్రభుత్వం అనుమతించిన నాణ్యమైన పత్తి విత్తనాలను విక్రయించాలి
జనం న్యూస్ మే 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖరీఫ్ సీజన్ సన్నాహకాలపై మండల వ్యవసాయ అధికారి మార్క ప్రియదర్శిని ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువులు పురుగుమందుల డీలర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీలర్లు హెచ్.టి. పత్తి విత్తనాల విక్రయాన్ని పూర్తిగా నివారించాలని, ప్రభుత్వం అనుమతించిన నాణ్యమైన పత్తి విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించరాదని స్పష్టంగా ఆదేశించారు. అన్ని డీలర్లు తమ వద్ద రిజిస్టర్లు, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించడంతో పాటు లైసెన్సులను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని, స్టాక్ బోర్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలియజేయాలి విత్తనాలకు సంబంధించిన సోర్స్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా నిర్వహించాలని యూరియా విక్రయాలను పూర్తిగా ఫర్టిలైజర్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. గడువు ముగిసిన లేదా నాణ్యతలేని పురుగుమందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని హెచ్చరించారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల డీలర్లు